: విచారణ వేగవంతంగా జరగడం లేదు.. నిర్లక్ష్యం వహిస్తున్నారు.. శిశువు అపహరణపై బంధువుల ఆందోళన
విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో శిశువును అపహరించిన ఘటనపై ఆ పసికందు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆచూకి ఇంకా లభించకపోవడంతో తమ శిశువుని తమకు అప్పగించే వరకు ఆసుపత్రి ముందు నుంచి కదలబోమని వారు తేల్చిచెబుతున్నారు. తమ శిశువు ఆచూకి కనిపెట్టే క్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ వేగవంతంగా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ శిశువును తమకు అప్పగించే వరకు పచ్చి మంచి నీరయినా ముట్టుకోబోమని చెబుతున్నారు. కాగా, ఈ ఆందోళన నేపథ్యంలో ఆసుపత్రి వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగకుండా అధికారులు అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.