: పోట్లాట వద్దని చెప్పిన మామపై కోడలి దాడి... గాయాలతో మృతి!


ఇద్దరు కోడళ్లు పోట్లాడుకుంటుంటే వద్దని వారించిన మామపై తీవ్రంగా దాడి చేసిన దారుణ సంఘటన బీహార్ లోని దర్భంగ జిల్లాలోని లాహి గ్రామంలో ఈరోజు జరిగింది. నాథుని మండల్ (50)కు ఇద్దరు కోడళ్లు.. అరుణాదేవి, పవన్ దేవి. ఒక విషయమై వీరిద్దరూ పోట్లాడుకుంటుండటం చూసిన నాథుని మండల్ వద్దని వారించాడు. దాంతో కోడళ్లకు కోపం ముంచుకొచ్చింది. తమ గొడవలో ఎందుకు తలదూర్చావంటూ ఒక కోడలు ఆయనను కర్రతో బాదిపారేసింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ సంఘటనపై పోలీసు అధికారి దిల్ నవాజ్ అహ్మద్ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News