: భారత్ 'స్పిన్ త్రయం' దెబ్బకు 180 పరుగులకే ఆలౌటైన బోర్డు ఎలెవన్
భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ ఆశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలు రాణించడంతో సెయింట్ కిట్స్ లో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్ లో బోర్టు ఎలెవన్ జట్టు 180 పరుగులకు కుప్పకూలింది. అశ్విన్, జడేజాలకు చెరి మూడు, అమిత్ కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ బోర్డు ఎలెవన్ జట్టులో కార్న్ వాల్ (41) మినహా మరెవరూ రాణించలేదు. మొత్తం 62.5 ఓవర్లలో 180 పరుగులకు జట్టు ఆలౌటైంది. ఆపై తొలి ఇన్నింగ్స్ ను భారత జట్టు ప్రారంభించగా, ఓపెనర్లు మురళీ విజయ్ 23 పరుగులకు, ధావన్ 9 పరుగుల స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. వన్ డౌన్ లో వచ్చిన పుజారా 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 25.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు.