: రేషన్ కార్డులు తొలగిస్తారనేది దుష్ప్రచారమే!: ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు


ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించే సమగ్ర సమాచారంతో తెల్ల రేషన్ కార్డులు తొలగిస్తారంటూ వైఎస్సార్సీపీ చేస్తున్నది దుష్ప్రచారమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని, తద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సమాచారం ద్వారా ప్రభుత్వ పథకాలేవీ రద్దు చేయడం జరగదని, సంక్షేమ పథకాలు మరింతగా అందుతాయని ఆయన చెప్పారు. అందుకే సర్వేలో సమగ్ర వివరాలు అందజేయాలని, అలా చేస్తే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News