: నెలరోజులుగా కనిపించకుండాపోయిన ఒడిశా 'వండర్ కిడ్' బుదియా!
ఒడిశా వండర్ కిడ్, మారథాన్ వీరుడు బుదియా సింగ్ ఆచూకీ నెలరోజులుగా తెలియడం లేదు. బుదియా కనపడకపోవడంపై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పోర్ట్స్ హాస్టల్ లో ఉంటున్న బుదియా మిస్సింగ్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయమై మూడు రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని స్పోర్ట్స్ హాస్టల్ ఇన్ చార్జ్ ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు బెనుధర్ సేనాపతి ఆదేశించారు. తమ కృషి వల్లనే బుదియా కళింగ స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్నాడని ఆయన అన్నారు. మే 10వ తేదీన వేసవి సెలవులకని తన తల్లి వద్దకు వెళ్లిన బుదియా ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కాగా, బుదియా మూడేళ్ల వయసులోనే మారథాన్ లో పాల్గొని, నాలుగేళ్ల వయసులో 40 మైళ్లు పరిగెత్తిన రికార్డుతో పాటు అతి చిన్న వయసులోనే 48 మారథాన్ లు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.