: పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ బస్సును ఢీ కొన్న వ్యాన్.. 10 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరం
ఓ స్కూల్ బస్సుని వ్యాన్ ఢీకొట్టడంతో 17 మంది విద్యార్థులకు గాయాలయిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలిపుర్దౌర్ ప్రాంతంలో ఈరోజు చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలయిన విద్యార్థుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎదురుగా వేగంగా వచ్చిన వ్యానే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయాలైన విద్యార్థులను అక్కడి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సుని ఢీ కొట్టిన వ్యాన్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.