: పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం
పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం విధించారు. జంక్ ఫుడ్ లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలవుతారని, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సుకేష్ కాలియా పేర్కొన్నారు. పలు కమిటీల నివేదికల అనంతరం పాఠశాలల్లో జంక్ ఫుడ్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని కాలియా పేర్కొన్నారు.