: మందుబాబులకు కేసీఆర్ రోల్ మోడల్ : టీడీపీ నేత రేవంత్ రెడ్డి
మందుబాబులకు కేసీఆర్ రోల్ మోడల్ అని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేకాట క్లబ్ లు మూసేసిన కేసీఆర్ కు పబ్ లు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అధికారం మాత్రం కేసీఆర్ అనుభవిస్తున్నారని విమర్శించారు. పదవులు అనుభవించడం త్యాగాలవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ లేదని బీజేపీ చెప్పడం మిత్రధర్మానికి విరుద్ధమని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేని ప్రతిపక్షాలు ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటేనని రేవంత్ రెడ్డి విమర్శించారు.