: డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి మంత్రి నాయిని పరామర్శ
శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని నాయిని ఈరోజు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలందించాలని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ కు ఈ సందర్భంగా నాయిని సూచించారు. కాగా, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న నిమ్స్ లో చేరారు. ఆయనకు డాక్టర్ పరం జ్యోతి, డాక్టర్ సుబ్బలక్ష్మి, డాక్టర్ శేషగిరిరావు వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు.