: 'ఏపీ'కి కొత్త కొత్త నిర్వచనం చెప్పిన అంబటి రాంబాబు!


చంద్రబాబు పాలనలో 'ఏపీ' అంటే ఆంధ్రప్రదేశ్ కాదని, 'అవినీతి ప్రదేశ్' అని వైకాపా నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్ సుజల స్రవంతిని గాలికి వదిలేసిన ప్రభుత్వ అధికారులు నారా వారి సారా స్రవంతిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కమిషన్ల కోసం కాపురాలు కూలుస్తున్నారని, చంద్రబాబు నాయుడిని మందుబాబు నాయుడని పిలిచే రోజులు రానున్నాయని ఎద్దేవా చేశారు. ప్రచార ఆర్భాటాలకు పెద్దపీట వేస్తున్నారని, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని అంబటి ఆరోపించారు.

  • Loading...

More Telugu News