: శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: వికారాబాద్ సీఐ


విచారణకు హాజరు కాని టీవీ నటి శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన అన్న భార్యపై దాడి చేసిన కేసు విషయమై విచారణకు హాజరుకావాలని శ్రీవాణికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఆమె హాజరుకాలేదని, షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోతున్నానని చెప్పిందని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టు తప్పదని అన్నారు. శ్రీవాణి వదిన అనూష ఈ విచారణకు హాజరైందన్నారు. కాగా, ఇంటి స్థలం విషయమై రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News