: మాతృత్వం ఎప్పుడన్న రాజ్ దీప్ సర్దేశాయ్!... ఆగ్రహంతో ఊగిపోయిన సానియా!


హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలో ప్రత్యర్థిపైనే కాదండోయ్... ఇబ్బందిపెట్టే ప్రశ్నలపైనా విరుచుకుపడతారు. ఇందుకు నిదర్శనంగా ఓ నేషనల్ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రఖ్యాత జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ పై ఆగ్రహావేశంతో ఊగిపోయారు. సానియా ఫైర్ తో కంగారుపడ్డ రాజ్ దీప్ ఆనక ఆమెకు సారీ చెప్పక తప్పలేదు. వివరాల్లోకెళితే... టెన్నిస్ లో తన ప్రస్థానంపై ‘ఏస్ అగెనెస్ట్ ఆడ్స్’ పేరిట ఆమె రాసిన బుక్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్... సానియాకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారు? మాతృత్వం ఎప్పుడు? అంటూ కాస్తంత ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలతో మనసు నొచ్చుకున్న సానియా రాజ్ దీప్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. మాతృత్వం ఎప్పుడు? అని అడిగే ముందు తాను సాధించిన టైటిళ్లు కనిపించడం లేదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె సుదీర్ఘ సమాధానం విన్న రాజ్ దీప్ తాను వేసిన ప్రశ్న తప్పని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏమాత్రం భేషజాలకు పోకుండా ఆయన సానియాకు సారీ చెప్పారు. ‘‘మీకు వేసిన ప్రశ్నలను నేను ఇప్పటిదాకా ఏ పురుష క్రీడాకారుడికి వేయలేదు. తప్పు చేశాను. మన్నించండి’’ అంటూ ఆయన సారీ చెప్పడంతో సానియా కాస్తంత రిలాక్స్ అయిపోయారు. 'తొలిసారిగా నేషనల్ ఛానెల్ లో ఓ విలేకరి చేత సారీ చెప్పించుకోగలిగాను' అంటూ ఆమె సరదా వ్యాఖ్య చేయడంతో అక్కడితో ఆ వివాదానికి తెర పడిపోయింది.

  • Loading...

More Telugu News