: ఆ ఫొటో చూసి మా అమ్మ కూడా నేనే అనుకుంది!: ప్రియాంక చోప్రా


బాలీవుడ్ భామ ప్రియంక చోప్రా పోలికలతో ఉండే అమ్మాయి నవ్ ప్రీత్ బంగా గుర్తుండే ఉంటుంది. నవ్ ప్రీత్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చేల్ చేసినప్పుడు అందరూ ప్రియాంక ఫొటోలే అనుకున్నారు. కాదని తెలియడంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. అన్నింటికంటే ఆశ్చర్య మేమిటంటే, నవ్ ప్రీత్ ఫొటోలను చూసి ప్రియాంక తల్లి కూడా గుర్తుపట్టలేకపోవడం. ఈ విషయాన్ని ప్రియంక తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పింది. ‘నవ్ ప్రీత్ ఫొటోను మా అమ్మకు చూపించా, అందులో వున్నది నేనే అనుకుంది' అని ఆ ట్వీట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News