: రాందాస్ అథవాలే పీఎస్ గా దేవయాని ఖోబ్రగడే!


కేంద్ర మంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన దళిత నేత రాందాస్ అథవాలే తన వ్యక్తిగత కార్యదర్శిగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు చెందిన దేవయాని ఖోడ్రగడేను నియమించుకున్నారు. ఈ మేరకు నిన్ననే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దేవయాని ఎవరనేగా మీ డౌటు... రెండేళ్ల క్రితం అమెరికాలో పనిమనిషిని నానా హింసకు గురి చేసి పెను విమర్శలు ఎదుర్కొన్న ఐఎఫ్ఎస్ అధికారే ఈమె. నాడు అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఖోబ్రగడే... డిప్యూటీ కాన్సుల్ జనరల్ గా పని చేశారు. పనిమనిషిని హింసకు గురి చేసిన కారణంగా నాడు అమెరికా ఖోబ్రగడేను తిప్పి పంపింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ భారతీయ మహిళను వెనక్కు పంపుతారా? అంటూ నాడు అమెరికాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఎంత వేగంగా వివాదం రేగిందో, ఖోబ్రగడే స్వదేశం చేరాక అంతే వేగంగా ఆ వివాదం సద్దుమణిగింది. మొన్నటి మోదీ కేబినెట్ విస్తరణలో రాందాస్ అథవాలే సహాయ (స్వతంత్ర) మంత్రి హోదాలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అథవాలే... తన సామాజిక వర్గానికి చెందిన అధికారినే తన పీఎస్ గా నియమించుకున్న వైనం ఢిల్లీలో హాట్ టాపిక్ అయింది.

  • Loading...

More Telugu News