: చిన్నారి హర్షితకు ఉచిత శస్త్రచికిత్సకు మంత్రి హామీ


కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హర్షిత శస్త్ర చికిత్స బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. తమ కూతురుకు శస్త్ర చికిత్స చేయించే ఆర్థిక స్తోమత తమకు లేదని, మెర్సీ కిల్లింగ్ కు అనుమతివ్వాలంటూ హర్షిత తల్లిదండ్రులు హెచ్చార్సీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. హర్షిత తల్లిదండ్రులను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హర్షిత తండ్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హర్షితకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయిస్తామని మంత్రి తమకు హామీ ఇచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News