: జైలు నుంచి విడుదలైన హార్దిక్ పటేల్ కు ఘన స్వాగతం


గుజరాత్ లో పటీదారు నాయకుడు హార్దిక్ పటేల్ ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. సూరత్ లోని లజ్ పోర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన హార్దిక్ కు ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. హార్దిక్ విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు పటేళ్ల నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం బందోబస్తును కట్టుదిట్టం చేసింది. కాగా, గుజరాత్ లో పటేళ్ల రిజర్వేషన్ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ కు మూడో కేసుకు సంబంధించిన బెయిల్ రావడం ఆలస్యమైన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేయడంతో పాటు, గుజరాత్ కు ఆరు నెలల పాటు దూరంగా ఉండాలంటూ కోర్టు షరతు విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నలభై ఎనిమిది గంటల్లోగా హార్దిక్ గుజరాత్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News