: నా టీవీని ఎందుకు నిషేధించారో చెప్పండి!: జకీర్ సూటి ప్రశ్న


అరెస్ట్ భయంతో భారత్ వచ్చేందుకే భయపడి సౌదీ అరేబియాలోనే ఉంటూ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన ఇస్లామిక్ వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ ప్రపంచ దేశాలకు పలు ప్రశ్నలు సంధించారు. సౌదీ అరేబియాలోని మదీనలో ఉంటున్న ఆయన ఓ రహస్య ప్రదేశం నుంచి ముంబైలోని మీడియా ప్రతినిదులతో ‘స్కైప్’ ద్వారా మాట్లాడిన సందర్భంగా... అసలు తన ఆధ్వర్యంలోని ‘పీస్ టీవీ’ని ఎందుకు నిషేధించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పీస్ టీవీ ద్వారానే జకీర్ నాయక్ ప్రసంగాలను విశ్వవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వింటున్నారు. ఈ క్రమంలో మొన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో పట్టుబడ్డ ఓ ఉగ్రవాది తాను జకీర్ నాయక్ ప్రసంగాలతోనే ఉగ్రవాదం వైపు మళ్లానని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా జకీర్ చుట్టూ వివాదాలు రేగాయి. అప్పటికే విదేశాల్లో ఉన్న జకీర్ వెనువెంటనే తిరిగి వచ్చేందుకు సిద్ధపడ్డా అరెస్ట్ భయంతో వెనకడుగు వేశారు. మూడు పర్యాయాలు మీడియా సమావేశాలను వాయిదా వేసుకున్న ఆయన తాజాగా కొద్దిసేపటి క్రితం స్కైప్ ద్వారా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉగ్రవాదాన్ని తానెన్నడూ ప్రోత్సహించలేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

  • Loading...

More Telugu News