: కాలేజీకి డుమ్మా కొట్టి, మద్యం తాగి... రమ్య ప్రాణాలు తీసిన శ్రావెల్!


హైదరాబాదులోని పంజాగుట్ట సమీపంలో మైనర్ బాలుర ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన చిన్నారి బాలిక రమ్య ఘటనలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి శ్రావెల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు అనుమతితో అతడిని రెండు రోజుల పాటు అన్ని కోణాల్లో విచారించారు. రెండు రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో నిన్న అతడిని కోర్టులో హాజరుపరిచి, విచారణలో వెల్లడైన పలు విషయాలను పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ వివరాల ప్రకారం యాక్సిడెంట్ జరిగిన రోజున శ్రావెల్ కాలేజీకని చెప్పి ఇంటి నుంచి బయటపడి అసలు కళాశాల ముఖమే చూడలేదట. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో చదువుతున్న తన ఐదుగురు స్నేహితులతోనూ కాలేజీకి డుమ్మా కొట్టించిన శ్రావెల్ వారిని బార్ కు తీసుకెళ్లాడు. బార్ లో ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత కారెక్కి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఈ క్రమంలోనే పంజాగుట్టలో వారి కారు కారణంగా రమ్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

  • Loading...

More Telugu News