: చంద్రబాబు రష్యా పర్యటన ముగిసింది!... హైదరాబాదు నుంచి బెజవాడ బయల్దేరిన ఏపీ సీఎం!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రష్యా పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రానికే అక్కడి పర్యటనను ముగించుకుని విమానం ఎక్కిన చంద్రబాబు నేటి ఉదయం హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. బిజీ షెడ్యూల్ కారణంగా కాసేపటి క్రితం హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరారు. మరికాసేపట్లో విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్న చంద్రబాబు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీగా మారనున్నారు. రాత్రి దాకా ఎడతెరిపి లేని షెడ్యూల్ ఖరారు చేసుకున్న చంద్రబాబు రేపు ఉదయం అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళతారు.