: 'పవిత్ర గంగాజలం' అంటూ మురుగు నీరు విక్రయిస్తున్న పోస్టల్ డిపార్ట్ మెంట్!


"పవిత్ర గంగాజలం కావాలా? మమ్మల్ని కోరితే, మీ ఇంటికే బాటిల్ లో నీటిని పంపుతాం" అంటూ ఇండియన్ పోస్టల్ శాఖ చేసిన ప్రచారానికి అమిత స్పందన రాగా, ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంగాజలం పేరిట భారత తపాలా శాఖ మురుగు నీటిని విక్రయిస్తోందని తమిళనాట పెరియార్ ద్రావిడర్ కళగం పార్టీ నిరసన ప్రదర్శనలు చేసింది. కేంద్రం విడుదల చేసిన కొత్త స్కీములో భాగంగా సోమవారం నుంచి గంగాజల విక్రయాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నీటిని ఆర్డర్ చేసిన వారికి శుద్ధి చేయని గంగాజలం చేతికందింది. దీంతో అన్నా శాలాయ్ పోస్టాఫీసు ముందు నిరసన తెలిపిన పీడీకే కార్యకర్తలు, బాటిళ్లను ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండియాలో అత్యధికంగా కలుషితమైన గంగానది నీటిని పంపారని ఆరోపించారు. ఈ నీటిని పరిశీలించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులు సైతం ఇది పూర్తిగా కలుషితమైన నీరని తేల్చి చెప్పినట్టు పీడీకే నేత వీ ఇలంగోవన్ వెల్లడించారు. కాగా, దేశంలోని ఎంపిక చేసిన 809 పోస్టాఫీసుల ద్వారా గంగాజలాన్ని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News