: దూసుకెళ్తున్న ట్రక్కును ఎలా నిలువరించి, నరహంతకుడిని మట్టుబెట్టారంటే..!


రహదారిని వదిలి ప్రజలు నడుస్తున్న ఫుట్ పాత్ పైకి ఎక్కిన ఓ ట్రక్కు మారణహోమం సృష్టిస్తూ దూసుకుపోతుండగా, విషయం తెలిసిన ఫ్రాన్స్ భద్రతాదళం వెంటనే స్పందించింది. అప్పటికే ట్రక్కును చూసిన పోలీసులు గన్స్ తో కాల్పులు జరుపుతూ విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలను పరిశీలిస్తే, ట్రక్కు ముందుభాగమంతా బులెట్ల వర్షంలో పూర్తిగా దెబ్బతింది. ట్రక్కు టైర్లు బరెస్ట్ అయి ఉన్నాయి. పోలీసులు ముందుగా టైర్లను పేల్చేసేందుకే ప్రయత్నించారని, టైర్లపై బులెట్ల వర్షం కురిపించినప్పటికీ, అది ఆగలేదని తెలుస్తోంది. టైర్లన్నీ పేలిపోయి ట్రక్కు కదలని స్థితిలో దాన్ని వదిలిన ముష్కరుడు ఓ రెస్టారెంటులోకి వెళ్లగా, దాన్ని చుట్టుముట్టిన పోలీసులు స్వల్ప వ్యవధిలోనే అతన్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇక దాడి జరిగిన నీస్ రహదారిపై పరిస్థితి భీతావహంగా ఉంది. తెగిపడ్డ అవయవాలు, రక్తపు ధారలు కనిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News