: ఫ్రాన్స్ ఉగ్ర ఘటనలో భారతీయులు క్షేమం: భారత్
ఫ్రాన్స్ లో జరిగిన ట్రక్కు దాడిలో దాదాపు 80 మంది వరకు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో భారతీయులు ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దాడి జరిగిన పారిస్ లోని నైస్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులతో రాయబారి టచ్ లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబరు 33-1-40507070ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కాగా గురువారం రాత్రి పొద్దుపోయాక నైస్ ప్రాంతంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానిస్తున్నా ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత లేదు.