: ఒక్క సామాజిక వర్గం మినహా... అందరికీ రిజర్వేషన్లు కావాలట!: జస్టిస్ మంజునాథ కామెంట్


ఏపీలో కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ నిన్న సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో ఒక్క సామాజిక వర్గం మినహా మిగిలిన అన్ని వర్గాలూ రిజర్వేషన్లను కోరుతున్నాయని ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నిన్న విజయవాడలో జస్టిస్ మంజునాథను అఖిల భారత కాపు సంఘం నేతలు కలిశారు. తమను బీసీల్లో చేర్చే విషయాన్ని త్వరగా తేల్చాలని కోరుతూ వారు ఆయనకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ జస్టిస్ మంజునాథ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో ఒక్క సామాజిక వర్గం మినహా మిగిలిన అందరూ రిజర్వేషన్ కోరుతున్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయి. తద్వారా అందరికీ న్యాయం చేస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News