: ఐఐటీ విద్యార్థులకు వడ్డీ రహిత రుణాలు!
ఇటీవల ఐఐటీల్లో ఫీజులను భారీగా పెంచడంతో వాటిని కట్టేందుకు ఇబ్బందిపడుతున్న ఐఐటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో వడ్డీ రహిత రుణాలందించే పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తీసుకునే రుణాలపై వడ్డీని తామే భరించే విధంగా ఈ పథకాన్ని రూపొందించింది. సంవత్సర ఆదాయం రూ.9 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులని, అయితే, ట్యూషన్ ఫీజుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఫీజు చెల్లింపులో ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడినవారికి మినహాయింపు ఉందని, ఆ వర్గాల్లోకి రాని, పెంచిన ఫీజును భరించలేని విద్యార్థుల కోసం ఈ పథకాన్ని రూపొందించామన్నారు.