: పరీక్షల్లో తక్కువ మార్కులు.. ఆత్మహత్య చేసుకున్న బాలిక: క్షమించాలని తల్లిదండ్రులకు లేఖ


పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న ఒకే ఒక్క కారణంతో ఢిల్లీలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా చదవలేకపోతున్నానని, తనను క్షమించాలని వేడుకుంటూ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • Loading...

More Telugu News