: హైదరాబాద్‌లో మహిళలను వేధిస్తున్న 23 మంది ఆకతాయిల అరెస్ట్


భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తున్న 23 మంది ఆకతాయిలను షీ టీములు అరెస్ట్ చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిమ్ కార్డులు విక్రయించే ఎన్.రెడ్డి కిరణ్(23), కె.రమేష్(23) మహిళలను వేధిస్తుండగా అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సామాజిక మాధ్యమం వాట్సాప్ ద్వారా మహిళలకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న మొహ్మద్ సలీముద్దీన్(25), విద్యార్థులు రవీందర్ యాదవ్, చిన్న మైసయ్య, లెమన్ సోడా విక్రయించే జంగం సంగప్ప(22) తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ వద్ద నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మహిళలపై అసభ్యంగా కామెంట్లు చేస్తున్న13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11 మంది మైనర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే చాంద్రాయణగుట్టలో మరో ముగ్గురు మైనర్లను షీ టీములు అదుపులోకి తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News