: మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై కానిస్టేబుల్ వీరంగం!


తెలంగాణలోని నిజామాబాదు జిల్లాలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ కానిస్టేబుల్ వీరంగమాడాడు. రాత్రి పొద్దుపోయేదాకా మద్యం సేవించిన కానిస్టేబుల్ సాల్మన్... ఆ మద్యం మత్తులోనే బైక్ ఎక్కాడు. అయితే అతడు వెళ్లే మార్గంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్న ట్రాఫిక్ పోలీసులు అతడి బండిని ఆపేసి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు సిద్ధపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురైన సాల్మన్ ట్రాఫిక్ కానిస్టేబుళ్లపై దాడికి దిగాడు. 'నన్నే టెస్ట్ చేస్తారా?' అంటూ అతడు మద్యం మత్తులో విరుచుకుపడటంతో ఏం చేయాలో తెలియక ట్రాఫిక్ కానిస్టేబుళ్లు బెంబేలెత్తిపోయారు. తర్వాత ఎలాగోలా అతడిని నిలువరించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News