: వెంకయ్య మంత్రాంగం!... కాంగ్రెస్ నేత ఆజాద్ కు స్వయంగా ఫోన్ చేసిన కేంద్ర మంత్రి!


పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గరపడుతోంది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న జీఎస్టీ బిల్లును ఈ దఫా అయినా ఆమోదింపజేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు యత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అప్పుడే రంగంలోకి దిగిపోయారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ కు ఆయన నిన్న స్వయంగా ఫోన్ చేశారు. ఈ సారైనా జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వాలని ఆయన ఆజాద్ ను కోరారు. బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఆజాద్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News