: ఢిల్లీ దీక్షకు మద్దతు కోరుతూ... రేవంత్ రెడ్డిని కలిసిన మంద కృష్ణ మాదిగ
తెలంగాణ టీడీపీ శాసనసభా పక్షనేత రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ నెల 19 నుంచి ఆగస్టు 12 వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నామని, ఈ దీక్షకు టీడీపీ మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన్ని కలిసిన మంద కృష్ణ ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మంద కృష్ణ మాదిగకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు.