: చిన్నారి అపహరణ గురించి చంద్రబాబు ఆరా... రష్యా నుంచి ఆదేశాలు!


విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి నుంచి చిన్నారి మాయమైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. రష్యా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, చిన్నారిని వెతికేందుకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం చిన్నారి ఆచూకీ తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, వైసీపీ నేతలు పార్థసారధి, వంగవీటి రాధా తదితరలు ఆందోళనకు దిగారు. మంత్రి కామినేని తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News