: కోటు ధరించే జకీర్ కు ఇస్లాంను బోధించే అర్హత లేదు: దారుల్ ఉలూమ్
వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ పై ప్రముఖ ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోటు, ప్యాంటు ధరించే జకీర్ కు ఇస్లాంను బోధించే అర్హత లేదని పేర్కొంది. ఆయనను బహిష్కరించాలని ముస్లింలకు ఆ సంస్థ పిలుపునిచ్చింది. జకీర్ నాయక్ 'టెలివాంజెలిస్ట్' అని చెప్పిన ఆ సంస్థ, అతని బోధనలకు సాధికారత లేదని పేర్కొంది. సామాన్యుడికి మంచి చెడులను తెలుసుకునే సామర్థ్యం ఉండదని పేర్కొన్న దారుల్ ఉలూమ్, ఆయన ఉపన్యాసాలు వినవద్దని, ఆయన మతపరంగా పక్కదారి పట్టారని తెలిపింది. యూదులు, క్రైస్తవులు ధరించే వస్త్రాలు ధరించాలని ఇస్లాంలో ఉందా? అని ఆ సంస్థ జకీర్ ను ప్రశ్నించింది.