: పాకిస్థాన్ లో ప్రతిభా?... ఎక్కడ? ఉన్న వాళ్లలో నేనే గ్రేటు...అందుకే రిటైర్మెంట్ లేదు: అఫ్రిదీ


పాకిస్థాన్ క్రికెట్ లో తనకంటే ప్రతిభావంతులు లేనందునే ఇంకా జట్టులో కొనసాగుతున్నానని ఆ జట్టు టీ20 జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తెలిపాడు. బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిదీ మాట్లాడుతూ, పాకిస్థాన్ జట్టులో అంతర్జాతీయ స్థాయికి తగ్గ ఆటగాళ్లు లేరని అన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు గురించి చెప్పాల్సింది చాలా ఉందని చెప్పిన అఫ్రిదీ, బోర్డుతో ఒప్పందం ఉండడం వల్ల చెప్పలేకపోతున్నానని అన్నాడు. పాక్ జట్టులో ఉన్న వారి కంటే తానే నయమని పేర్కొన్న అఫ్రిదీ, సమర్థవంతమైన ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకుంటున్నానని, అయితే సహచరులతో పోల్చుకున్నప్పుడు జట్టులో ఉండే అర్హత వారి కంటే తనకే ఉందనిపించిందని, అందుకే రిటైర్ అవ్వలేదని చెప్పాడు. పాకిస్థాన్ లో ప్రతిభ పుష్కలంగా ఉందని చెబుతుంటారని, అదంతా ఉత్తిదేనని అఫ్రిదీ తేల్చి చెప్పాడు.

  • Loading...

More Telugu News