: వచ్చే అక్టోబర్ నాటికి షిర్డీ ఎయిర్ పోర్ట్ రెడీ
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఎయిర్ పోర్టు సిద్ధం కానుంది. వచ్చే అక్టోబర్ లో ఎయిర్ పోర్టును ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వాస్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 900 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎయిర్ పోర్టుకు ఇప్పటి వరకు రూ.225 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా వంద కోట్ల పనులు మిగిలి ఉన్నాయని అన్నారు. యూకే, సింగపూర్, దుబాయ్ లతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చే యాత్రికులు ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల ద్వారా నేరుగా షిర్డీ చేరుకోవచ్చన్నారు. షిర్డీ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను త్వరలో ఆహ్వానిస్తామని విశ్వాస్ చెప్పారు.