: కేరళకు చెందిన పేద మహిళకు లాటరీలో కోటి!
అదృష్టం తలుపుతట్టడమంటే ఇదే...కేరళలోని రబ్బరు తోటల్లో పని చేసే పేద మహిళకు కోటి రూపాయల లాటరీ తగిలింది. కేరళ ప్రభుత్వం నిరుపేద మహిళల సహాయార్థం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' 11వ లాటరీ నబీసా అనే మహిళకు తగిలింది. తిరువనంతపురం జిల్లా కిలిమనూరుకు చెందిన నబీసా లాటరీలను తరచు కొంటుంది. ఆమెకు గతంలో పలు సందర్భాల్లో 1000 రూపాయల మొత్తంలో లాటరీలు తగిలాయి కానీ, పెద్ద మొత్తంలో లాటరీ రాలేదు. తాజాగా కేరళ ప్రభుత్వం ప్రకటించిన లాటరీ ఫలితాల్లో నబీసా కొన్న టికెట్ కు కోటి రూపాయలు వచ్చాయి. దీనిపై నబీసా ఆనందం వ్యక్తం చేసింది. తమ కుటుంబం కష్టాలు తీరిపోయాయని తెలిపింది. లాటరీ డబ్బులతో ఓ చిన్న ఇల్లు కొనుక్కుంటానని తెలిపింది. వికలాంగురాలైన తన చెల్లెలి చేత ఓ కిరాణా దుకాణం పెట్టిస్తానని ఆమె తెలిపారు.