: ఎంపీ అసదుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం


ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీపై రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిష‌న్ దాఖ‌ల‌యింది. ఇటీవ‌ల హైదరాబాద్‌లోని పాత‌బ‌స్తీలో అధికారులు జ‌రిపిన సోదాల్లో ప‌లువురు ఐసిస్ సానుభూతిప‌రులు ప‌ట్టుబ‌డిన అంశంపై అస‌దుద్దీన్ స్పందిస్తూ పట్టుబడ్డ వారికి న్యాయ‌స‌హాయం చేస్తాన‌ని వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. అస‌దుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యల ప‌ట్ల క‌రుణ‌సాగ‌ర్ అనే న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అస‌దుద్దీన్‌పై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని న్యాయ‌వాది కోర్టును కోరారు. దీంతో అస‌దుద్దీన్‌పై ఐపీసీ 124 కింద కేసు న‌మోదు చేయాల‌ని స‌రూర్ న‌గ‌ర్ పోలీసుల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచార‌ణ నివేదికను ఈనెల 30 లోగా స‌మ‌ర్పించాల‌ని పోలీసుల‌కి కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News