: 100 ఎకరాల్లో సల్మాన్ ఖాన్ హాలిడే హోమ్?
ముంబయిలోని గొరాయ్ బీచ్ సమీపంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాలిడే హోమ్ నిర్మిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ హాలిడే హోమ్ ను ఒకటి, రెండు ఎకరాల్లో కాకుండా ఏకంగా 100 ఎకరాల్లో నిర్మిస్తున్నాడట. సల్మాన్ కోసం ఐదు బెడ్ రూంల బంగ్లాతో పాటు తన కుటుంబీకులు, అతిథుల కోసం మరో రెండు బంగ్లాలు కట్టించే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి వెనుక భాగంలో డర్ట్ బైకింగ్ ఎరీనా కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. సల్లూ భాయి తన 51వ పుట్టినరోజుని ఈ హాలిడే హోంలో జరుపుకోవాలనుకుంటున్నాడని తెలుస్తోంది.