: తీరు నచ్చలే.. గుత్తేదారులకు దోచిపెట్టడంలో ఆంతర్యమేంటి?: తెలంగాణ ప్రభుత్వంపై నాగం ఫైర్
తెలంగాణ ప్రభుత్వ తీరుపై భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వ్యయం రూ.2082 కోట్లు పెంచారని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యయాన్ని ఇంత భారీగా పెంచడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. గుత్తేదారులకు ప్రభుత్వం దోచిపెట్టడంలో ఆంతర్యమేంటని నాగం దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆయన మండిపడ్డారు. కాగ్ అక్షింతలు వేసినా సర్కారు తీరు మారదా..? అని ఆయన ప్రశ్నించారు.