: రైల్వేల పాత రికార్డులన్నీ బద్దలు ... గంటకు 180 కి.మీ తాకిన రైలు వేగం


భారత రైల్వేలు వేగం విషయంలో కొత్త రికార్డులను నమోదు చేశాయి. స్పెయిన్ సంస్థ టాల్గో నుంచి దిగుమతి చేసుకున్న తేలికపాటి ట్రయిన్ మధుర, పాల్వాల్ మధ్య 86 కిలోమీటర్ల దూరాన్ని 39 నిమిషాల్లో ప్రయాణించింది. మార్గ మధ్యంలో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని ఈ రైలు అందుకుంది. దీంతో గతంలో గతిమాన్ ఎక్స్ ప్రెస్ పేరిట ఉన్న 160 కేఎంపీహెచ్ రికార్డు బద్ధలైంది. 4,500 హెచ్పీ డీజిల్ ఇంజనుకు ఖాళీ కోచ్ లను తగిలించి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. తదుపరి పాసింజర్ల సీట్లలో ఇసుక బస్తాలను ఉంచి మరో ట్రయల్ రన్ ను ముంబై, న్యూఢిల్లీ మధ్య నిర్వహిస్తామని, గంటకు 220 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం తమ లక్ష్యమని ఆగ్రా డివిజన్ రైల్వే మేనేజర్ దిలీప్ కుమార్ సింగ్ తెలిపారు. టాల్గో సంస్థ సెమీ స్పీడ్ (160 నుంచి 250 కి.మీ), హై స్పీడ్ (350 కి.మీ వరకూ) రైళ్లను తయారు చేస్తుండగా, సెమీ స్పీడ్ ఇంజన్లను ఇండియా ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News