: భవిష్యత్ కార్యాచరణ సిద్ధం.. ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తాం: ప్రొ.కోదండరాం
ప్రొ.కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్ నాంపల్లి ఐకాస కార్యాలయంలో ఈరోజు స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వివిధ సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై కోదండరాం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై సెమినార్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈనెల 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుల అధ్యయనం ఉంటుందని ఆయన ప్రకటించారు. భూసేకరణ విషయంలో ఎదురవుతోన్న సమస్యలపై అధ్యయనం చేశామని పేర్కొన్నారు. 15 రోజుల్లో నివేదిక తయారు చేయాలనే ఆలోచనలతో ఉన్నామని ఆయన తెలిపారు.