: ఇల్లు ఖాళీ చేస్తూ అట్టపెట్టెలు మోసిన డేవిడ్ కామెరూన్... వైరల్ అవుతున్న చిత్రం వెనకున్న అసలు కథ!


బ్రిటన్ ప్రధానిగా రాజీనామా చేసిన డేవిడ్ కామెరూన్ కుటుంబం, గత ఆరేళ్ల నుంచి నివసిస్తున్న 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి వెళ్లాల్సిన వేళ, ఓ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తన చేతులతో స్వయంగా ఓ పెద్ద అట్టపెట్టెను మోస్తున్న కామెరూన్ చిత్రం ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సైట్లలో తెగ తిరుగుతోంది. 'హ్యాండిల్ విత్ కేర్' అని రాసున్న ఈ అట్టపెట్టెను ఆయన మోసుకు వెళుతుంటే, వెనకాల పెద్ద ట్రక్ లో గృహోపకరణాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుంటూ, తన ఇంటి తరలింపు పనిని తాను చేస్తున్న కామెరూన్ ను పొగడుతూ ట్వీట్లు పంచుకున్నారు. ఇక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి తన సామాన్లు తాను మోసుకోవడం, అతనికి సాయం చేసే వారు లేకపోవడం పాలకులు సిగ్గు పడాల్సిన విషయమని తిట్ల దండకాన్నీ అందుకున్నారు. చివరికి అసలు విషయాన్ని 'డైలీ మెయిల్' బయటపెట్టింది. ఈ చిత్రం ఇప్పటిది కాదని, దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం లండన్ లోని నార్త్ కెన్సింగ్టన్ కు డేవిడ్ కామెరూన్ మారుతున్న వేళ తీసినదని నిజాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం 49 సంవత్సరాల వయసున్న కామెరూన్, ఈ చిత్రంలో యంగ్ గా యువకుడిగా కనిపిస్తున్నాడు. అయినప్పటికీ నెటిజన్లు ఈ చిత్రాన్ని వైరల్ చేస్తూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News