: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈరోజు కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌కి దుబాయ్ నుంచి వచ్చిన కెన్యాకు చెందిన దంపతులను చెక్ చేసిన అధికారులకు వారి వద్ద కేజీన్నర బంగారం ఉందని తెలిసింది. దంపతులు వారి వద్ద ఉన్న బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేదు. దీంతో వారి వద్ద లభించిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.