: కలికాలం... మద్యం మత్తులో 17 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడి!
పూటుగా మద్యం తాగిన 27 సంవత్సరాల యువతి, తనకు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన 17 ఏళ్ల యువకుడిని హోటల్ కు రప్పించి లైంగిక దాడి చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, వెస్ట్ ఢిల్లీ పరిధిలోని నజాఫ్ గఢ్ ప్రాంతానికి చెందిన యువతికి, కిషన్ గఢ్ కు చెందిన ఇంటర్ విద్యార్థికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. నిత్యమూ బాలుడితో చాటింగ్ చేసే ఆమె, మహిపాల్ పూర్ లోని త్రీ స్టార్ హోటల్ లో రూము బుక్ చేసుకుని, బాలుడిని పిలిచింది. ఆపై ఫుల్లుగా తాగి, తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేసింది. బాలుడి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, బాలుడు తనను బలవంతంగా అత్యాచారం చేశాడని సదరు యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కేసులనూ నమోదు చేశామని, విచారణ అనంతరం ఎవరు ఎవరిపై దాడి చేశారన్న విషయాన్ని తేల్చి చర్యలు తీసుకుంటామని సౌత్ ఢిల్లీ అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ నుపుర్ ప్రసాద్ వెల్లడించారు.