: వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 267 మంది మైనర్లు
హైదరాబాద్ మారేడ్ పల్లిలో ఇటీవల చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనతో వాహనాలు నడిపే మైనర్లను పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. మైనర్లు అనర్హమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో బేగంపేట ట్రాపిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 267 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకి వాహనాలిచ్చి రోడ్లపైకి పంపొద్దని, వారి పట్ల ప్రేమ మాత్రమే కాక బాధ్యత కూడా ఉండాలని పోలీసులు తల్లిదండ్రులకు తెలిపారు.