: 'జనతా గ్యారేజ్' క్లైమాక్స్ శాంపిల్ ను అప్ లోడ్ చేసిన నటుడు బ్రహ్మాజీ!
ఎన్టీఆర్ తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'లో క్లైమాక్స్ ఫైట్ సీన్ ఎలా ఉంటుందో నటుడు బ్రహ్మాజీ తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేశాడు. గ్యారేజ్ లో వర్షం పడుతున్న వేళ తీసిన ఈ ఫైటింగ్ దృశ్యాలను అభిమానులతో పంచుకున్నాడు. చిత్రంలోని ఫైట్లు ఎలా ఉంటాయో టేస్ట్ చూపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దూసుకెళుతోంది. రెండు వరుస విజయాల తరువాత హ్యాట్రిక్ పై కన్నేసిన ఎన్టీఆర్, ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లైమాక్స్ లో వీడియో లింకును ఉంచిన బ్రహ్మాజీ, వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.
#janathagarage #climax https://t.co/0DDcsODoXn
— BRAHMAJI (@actorbrahmaji) July 13, 2016