: గంగూలీని సల్మాన్ ఖాన్ తో పోలుస్తూ సెహ్వాగ్ వ్యాఖ్యలు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పోలుస్తూ, వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం నార్త్ వెస్ట్ వన్డే సిరీస్ ను గెలిచిన వేళ, లార్డ్స్ మైదానంలో గంగూలీ చొక్కావిప్పి, దాన్ని గాల్లోకి తిప్పుతూ విజయానందాన్ని ప్రకటించిన సంగతిని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. అచ్చు సల్మాన్ లా గంగూలీ చేశాడని చెప్పిన సెహ్వాగ్, ఆనాటి ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. 2002 జూలై 13న ఇంగ్లండుతో ఫైనల్ జరుగగా భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ముంబైలో జరిగిన మ్యాచ్ లో భారత్ పై ఇంగ్లండ్ గెలిచిన వేళ, ఫ్లింటాఫ్ తన చొక్కా విప్పి గంతులేశాడు. దీనికి ప్రతీకారాన్ని గంగూలీ తీర్చుకున్నాడని సెహ్వాగ్ తెలిపాడు. ఈ ఘటన జరిగిన ముందు రోజు జట్టు కెప్టెన్ హోదాలో సూటు, బూటుతో దిగిన ఫోటోను, ఆపై చొక్కా విప్పి విజయానందాన్ని వ్యక్తం చేస్తున్న ఫోటోను ఉంచాడు.
14 yrs ago Dada @SGanguly99 took of his shirt in an epic match&he was at the very same Lords yesterday in Suit-Boot pic.twitter.com/M0CjMyIqvN
— Cricket Talkies (@CricketTalkies) July 13, 2016