: మన్మోహన్ సింగ్ అల్లుడికి కీలక బాధ్యతలిచ్చిన మోదీ సర్కారు
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అల్లుడు ఏకే పట్నాయక్ కు అత్యంత కీలక విభాగాల్లో ఒకటైన నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) బాధ్యతలు అప్పగిస్తూ, నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దేశంలోని నిఘా విభాగాలకు, చట్టాలను అమలు చేసే సంస్థలకు ఆన్ లైన్ సమాచారాన్ని అందించే బాధ్యతలను నాట్ గ్రిడ్ చూస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న పట్నాయక్ ను నాట్ గ్రిడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థుల బంధువులను కీలక పదవుల్లో నియమించడం పెద్దగా కనిపించదు. కానీ, మోదీ ప్రభుత్వం పట్నాయక్ కు నాట్ గ్రిడ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా తన ప్రత్యేకతను చూపింది.