: 'కిరాతక ప్రేమ'కు బలైన స్వాతి పేరిట ఇన్ఫోసిస్ ప్రత్యేక యాప్
రామ్ కుమార్ కిరాతక ప్రేమకు బలైన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతికి నివాళిగా ఓ ప్రత్యేక యాప్ తయారవుతోంది. స్వాతి జ్ఞాపకార్థం దీన్ని వచ్చే నెలలో అందుబాటులోకి తెస్తామని, మహిళల రక్షణ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఇన్ఫోసిస్ ప్రకటించింది. రైల్వే పోలీసులు మహిళా భద్రత కోసం యాప్ తయారుచేయ సంకల్పించగా, స్వాతి పేరు దీనికి పెట్టిన పక్షంలో తామే చేసిస్తామన్న ఇన్ఫోసిస్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. గత నెలలో చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో స్వాతిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు రామ్ కుమార్ అరెస్టు కాగా, కేసు విచారణ జరుగుతోంది.