: జంజంబట్టులో చిత్తూరు పోలీసులు!... ముగ్గురు అంతర్జాతీయ ‘రెడ్’ స్మగ్లర్ల అరెస్ట్!
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే విషయంలో చిత్తూరు జిల్లా పోలీసులు ప్రతినబూనారు. శేషాచలం కొండల్లోని విలువైన ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్న కొందరు అక్రమార్కులు సదరు చెట్లను దుంగలుగా మార్చేసి గుట్టుచప్పుడు కాకుండా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పగ్గాలు చేపట్టగానే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్రమార్కులకు కళ్లెం వేసిన చిత్తూరు జిల్లా పోలీసులు తాజాగా తమిళనాడులోని జంజంబట్టులో ముమ్మర సోదాలు నిర్వహించారు. ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లకు సంకెళ్లేశారు. ఈ సందర్భంగా రూ.3 కోట్ల విలువ చేసే ఏ1 రకానికి చెందిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.