: రూ.1,500 కోట్ల పన్ను ఎగవేసిన ‘ఇండియా బుల్స్’?... దేశవ్యాప్తంగా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు!


దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో సదరు అక్రమాలను నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. వెరసి పెద్ద ఎత్తున ఐటీ, ఈడీ, సీబీఐ సోదాలు నిత్యకృత్యంలా మారాయి. మొన్న కమోడిటీ మార్కెట్ కింగ్ జిగ్నేష్ షాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోగా, నిన్న తమిళనాడుకు చెందిన మాజీ కేంద్ర మంత్రి జగద్రక్షకన్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ ముమ్మర సోదాలు చేసింది. ఓ వైపు ఈ సోదాలు జరుగుతుండగానే ఇండియా బుల్స్ గ్రూప్ నకు చెందిన 30 కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు చేసింది. దాదాపు రూ.1,500 కోట్ల మేర పన్నును ఆ సంస్థ ఎగవేసిందన్న ఆరోపణలతోనే సదరు కంపెనీ కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సంస్థకు చెందిన ముంబై, చెన్నై, ఢిల్లీలోని కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ షేరు ధర ఒక్కసారిగా 7 శాతం మేర నష్టపోయింది.

  • Loading...

More Telugu News