: ఈ ప్రపంచంలో నేను ఆనందంగా ఉంచాల్సినది ఆ ముగ్గురినే!: హాస్యనటుడు సప్తగిరి


ఈ ప్రపంచంలో తాను ఆనందంగా ఉంచాల్సిన వ్యక్తులు ముగ్గురున్నారని హాస్య నటుడు సప్తగిరి తెలిపాడు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సప్తగిరి మాట్లాడుతూ, తన కోసం ఎంతో చేసిన తన తల్లిదండ్రులు, సోదరుడ్ని ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నాడు. అయితే తిరుమలేశుని దయవల్ల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, వాటి ద్వారా ఆదాయం వస్తోందని, దానితో వారి కోరికలన్నీ తీర్చగలుగుతున్నానని అన్నాడు. ఇప్పటి వరకు నాకు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వండి అని తానెవరినీ అడగలేదని సప్తగిరి చెప్పాడు. తనతో పని చేయించుకుని, ఎంత మొత్తం ఇవ్వాలో దర్శకనిర్మాతలకు తెలుసని అన్నాడు. ఇప్పుడు తానున్న స్థాయిని చూసి తన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని చెప్పాడు. ఏదైనా చెయ్యాలా? అని వారినడిగితే 'చాల్లేరా' అంటారని సప్తగిరి తెలిపాడు. ఈ ముగ్గురిని సంతోషంగా ఉంచగలిగితే తనకు చాలని ఆయన చెప్పాడు.

  • Loading...

More Telugu News